వనపర్తి: జూరాల ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తివేత

వనపర్తి జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు 13 గేట్లను శనివారం ఎత్తి ప్రాజెక్టు నీటిని కిందికి విడుదల చేస్తున్నామని ఏఈ బీచుపల్లి తెలిపారు. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణ పూర్ ప్రాజెక్టుల నుంచి స్వల్పంగా ప్రాజెక్టుకు 86, 000 క్యూసెక్కుల వరద నీరు చేరడంతో 54, 000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు ఏఈ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 9. 547 టీఎంసీలకు గాను 5. 835 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி