వనపర్తి: 6వేల రూపాయల పెన్షన్ వెంటనే ఇవ్వాలి

వనపర్తి పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో బుధవారం ఎన్. పి. ఆర్. డి. వికలాంగుల సంఘం వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి అడివయ్య పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం వికలాంగులకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆరువేల రూపాయల పెన్షన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி