ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండ్

వనపర్తి జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ గురువారం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరంగాపూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన రాకేష్ హైదరాబాద్ గణేష్ బందోబస్తుకు వెళ్లి విధులలో చేరకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం సీసీఏ రూల్స్ కు విరుద్ధమని సస్పెండ్ చేశారు. పానగల్ పోలీస్ స్టేషన్ కు చెందిన రామకృష్ణ అనుమతి లేకుండా విధులకు గైర్హాజరుతో సస్పెండ్ చేశారు.

தொடர்புடைய செய்தி