మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇన్చార్జీలుగా నియమించిన ఎంపీ, ఎమ్మెల్యేల పనితీరును సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఇన్చార్జీగా ఉన్న దీగ్రాస్ నియోజకవర్గ నేర్ పట్టణం ఎన్నికల బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ తెలంగాణ ఎంపీల ఫోరం కన్వీనర్, యవత్మాల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లురవి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఎమ్మెల్యేలు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్నారు.