వనపర్తి జిల్లాలో 60 మంది బాల నేరస్థులు

వనపర్తి జిల్లాకు బాలరక్ష భవన్ మంజూరయిందని బాలల హక్కులకు భంగం వాటిల్లకుండా వారి సాధికారతకు బాల రక్షాభవన్ తోడ్పడుతుందని ఆదివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. వచ్చే బుధవారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. జిల్లాలో 60 మంది దాకా బాల నేరస్థులు ఉన్నట్లు వారి కేసు వివరాలు ఈ కేంద్రంలో తెలుసుకోవచ్చు అన్నారు. బాలల న్యాయ మండలి (జేజేబి) కూడా ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటుందన్నారు.

தொடர்புடைய செய்தி