నారాయణపేట: ప్రశాంతంగా ముగిసిన మొదటి పరీక్షలు

నారాయణపేటలో ఆదివారం జరిగిన గ్రూప్-3 పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఉదయం జరిగిన మొదటి పరీక్షకు జిల్లాలో మొత్తం 4024 మంది అభ్యర్థులకు గాను, 2353 మంది హాజరు కాగా, 1671 మంది గైర్హాజరు అయ్యారని, మధ్యాహ్నం పరీక్షకు 2354 మంది అభ్యర్థులు హాజరు కాగా, 1670 మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోలేదని చెప్పారు.

தொடர்புடைய செய்தி