కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత సిఎం రేవంత్ రెడ్డికి లేదని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యులు నాగూరావు నామాజి అన్నారు. బుధవారం నారాయణపేట పట్టణంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఇటలీ దేశానికి చెందిన సోనియాగాంధీ కి సిఎం రేవంత్ రెడ్డి గులాంగిరీ చేస్తున్నారని, ఈ దేశంలో వుండే అర్హత లేదని అన్నారు. కిషన్ రెడ్డి గురించి మాట్లాడే ముందు ఆలోచన చేయాలని హితవు పలికారు.