నారాయణపేట జిల్లా కేంద్రంలోని గ్రూప్ - 3 పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన పేపర్ - 2 పరీక్షలను పరిశీలించారు. ఎంత మంది పరీక్షలకు హాజరు అయ్యారు అని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ను అడిగి తెలుసుకున్నారు. పరీక్షల అనంతరం జవాబు పత్రాలను నిబంధనల మేరకు సిల్ వేసి పోలీస్ భద్రత మధ్య తరలించాలని చెప్పారు. పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.