నారాయణపేట: నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం చట్ట వ్యతిరేకం

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని నారాయణపేట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేపూరి రాములు అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడారు. నోటీసులు ఇవ్వకుండా చట్ట వ్యతిరేక చర్య అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. అక్రమ అరెస్టులను నిలిపి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని హితవు పలికారు.

தொடர்புடைய செய்தி