నాగర్ కర్నూల్ జిల్లాలోని షెడ్యూల్ కులానికి చెందిన విద్యార్థులు 2024 –25 విద్యాసంవత్సరానికి ప్రభుత్వం చెల్లించే ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పి. వీ శ్రవణ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ మూడు దశల్లో ఉంటుందని, డెమో అథెంటికేషన్, బయోమెట్రిక్ అథెంటికేషన్, రిజిస్ట్రేషన్ దశలు ఉంటాయన్నారు.