పెచ్చులూడిన తరగతి గది

నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మొత్తం 113మంది విద్యార్థులు చదువుతున్నారు. బుధవారం 4వ తరగతి గదిలో మధ్యాహ్నం సమయంలో విద్యార్థులు క్లాసులో ఉండగా ఒక్కసారిగా పైకప్పు నుంచి పెచ్చులు ఊడి కింద పడడంతో విద్యార్థులు భయంతో బయటికి పరుగులు తీశారు. ఆ సమయంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. పాఠశాలలో నూతన భవనం నిర్మించాలని విద్యార్థులు, గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி