క్రీడలు మానసిక వికాసానికి దోహదపడతాయి

క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వానికి ఎంతో దోహదపడతాయని కల్వకుర్తి మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు ఎముక జంగయ్య అన్నారు ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని సిబిఎం కళాశాల సమీపంలోని మైదానంలో జరుగుతున్న కేలో ఇండియా ఉమెన్ లీగ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జిల్లా స్థాయి శిక్షణ ఎంపిక కార్యక్రమానికి సర్పంచ్ ఎముక జంగయ్య హాజరయ్యారు. అనంతరం జెండా ఊపి పరుగు పందెం పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినిలు చదువుతోపాటు కృషి, పట్టుదలతో క్రీడలలో రాణించాలన్నారు. క్రీడలలో రాణిస్తే దేశవ్యాప్తంగా పేరు సంపాదించడంతోపాటు కన్నవారికి , ఉన్న ఊరుకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన వారు అవుతారన్నారు. జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారినీలు పి. టి ఉష, సానియా మీర్జా, మిత్తాలి రాజ్, పీ. వీ సింధు లతోపాటు పూర్ణ, ఆనందులను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. క్రీడాకారునిలకు చదువుతోపాటు సమాజంలో కూడా ఎంతో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు ఉంటాయని, ఆటల్లో పాల్గొంటున్న క్రీడాకారునిలకు తనవంతుగా సహాయ, సహకారాలు అందజేస్తానని తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలపోగుల స్వాములు మాట్లాడుతూ ఈనెల 19వ తేదీన హైదరాబాద్ లోని ఆర్టిలరీ సెంటర్ గోల్కొండ లో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఎంపిక కోసం క్రీడాకారులకు ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.

జిల్లాస్థాయి ఎంపికకు జిల్లా నాలుమూలల నుండి 150 మంది క్రీడా మహిళలు పాల్గొన్నారన్నారు. జిల్లా కు 100 మీటర్ లు, 200 మీటర్ లు , 400 మీటర్లు, 800 మీటర్లు 1500 మీటర్లు, 3000 మీటర్లు 5000 మీటర్లు, షాట్ పుట్, జావలిన్ త్రో, డిస్కస్త్ త్రో, లాంగ్ జంప్ , హై జంప్ , ట్రిపుల్ జంప్, ఈవెంట్స్ కి పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో
సంయుక్త కార్యదర్శి పూలే అంజయ్య, స్వేరోస్ నాయకులు దుబ్బ నాగేష్ , బాల్ జంగయ్య, భీమయ్య , ఎం. రమేష్, ఎం. డి తురాభ్, కోకోరాజు , మల్లేష్ ఎం. నరేష్ , క్రీడాకారులువ్యాయామ ఉపాధ్యాయురాలు అనూష, క్రీడాకారినీలు తదితరులు పాల్గొన్నారు.
.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி