మహబూబ్ నగర్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కురుమూర్తి జాతర కోసం ప్రత్యేక బస్సులను గురువారం మహబూబ్ నగర్ రీజినల్ మేనేజర్ శ్రీదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్. యం మాట్లాడుతూ. భక్తుల సౌకర్యార్థం రీజియన్ మొత్తంగా ప్రతి డిపో నుంచి కూడా బస్సులను నడుపుతున్నామని తెలిపారు. ప్రజలు ప్రైవేటు ఆపరేటర్లపై ప్రయాణం చేయకుండా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సుజాత, సిబ్బంది పాల్గొన్నారు.