మహబూబ్ నగర్: 108లో ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం

పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను 108 అంబులెన్స్ లో దవాఖానాకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించిన ఘటన మంగళవారం మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. మహమ్మదాబాద్ మండలంలోని జూలపల్లికి చెందిన శిరీష(23)ను ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు ఎక్కువ అవ్వడంతో ఈఎంటీ లక్ష్మీనారాయణ, పైలట్ అక్బర్ అంబులెన్స్ లోనే ప్రసవం చేశారు. శిరీష పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబ సభ్యులు 108సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி