దేవరకద్ర: ఇందిరా మహిళ శక్తి పథకంతో ఆర్థికాభివృద్ధి

దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని మహిళా సమైక్య కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలకు 1 కోటి 2 లక్షల రూపాయల చెక్కులను శనివారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరా మహిళ శక్తి పథకంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. మహిళలు మహిళ శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు.

தொடர்புடைய செய்தி