గద్వాల: రైతులకు రెండు లక్షల లోపు రుణమాఫీ చేయాలి

గద్వాల: జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ కానీ రైతులు భారీ ఎత్తున నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గరకు చేరుకొని రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ కి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. భారీ ఎత్తున వెయ్యి మందికి పైగా రైతులు కలెక్టర్ కార్యాలయం చేరుకొని కలెక్టర్ బయటకు వచ్చి తమ విన్నపాన్ని వినాలని కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி