దుమంగిలో 104 వైద్య సేవలు

గుమ్మలక్ష్మీపురం మండలం దుమంగి గ్రామంలో గురువారం 104 సిబ్బంది వైద్య సేవలు నిర్వహించారు. డాక్టర్ ప్రభాకర్ రావు, సచివాలయ సిబ్బంది, ఆశాలు, ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్ లు హాజరయ్యారు. బిపి షుగర్ తనిఖీ చేసి ఉచితంగా మందులు అందజేశారు. మలేరియా ఫీవర్ గురించి వివరించారు. దోమతెరలు వేడి నీళ్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా వైరస్ గురించి మాస్కులు శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ప్రభాకర్ రావు, డీఈవో సంతోష్ కుమార్ పైలెట్ ఈశ్వర్ రావు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி