జలదంకి మండలం బ్రాహ్మణ కాక పంచాయతీలో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం భూమి పూజ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సారధ్యంలో అభివృద్ధి పనులకు పునాధి వేసినట్లు వంటేరు తెలిపారు. కాగా గతంలోనూ బ్రాహ్మణ క్రాక స్మశాన వాటికను వంటేరు సొంత నిధులతో అభివృద్ధి చేశారు.