పుంగనూరు: మైనర్లను పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు

మైనర్లను పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని లేబర్ అధికారి మధుబాబు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం పుంగనూరు పట్టణంలోని పలు దుకాణాలు, హోటల్లు, వెల్డింగ్ షాపులలో అధికారి తమ సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేశారు. అధికారి మాట్లాడుతూ.. పెద్దలు పనికి వెళ్లాలని, పిల్లలు బడికి వెళ్లాలని తెలిపారు. అనంతరం షాపుల యజమానులకు పలు సూచనలు చేశారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

தொடர்புடைய செய்தி