నాయీ బ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని నాయీ బ్రాహ్మణ సంఘ జిల్లా మాజీ అధ్యక్షుడు గజపతి కోరారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని స్థానిక కంపోస్ట్ కాలనీలో ఉన్న ఓ భవనంలో మంగళవారం సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన నాగరాజును ఘనంగా సన్మానించారు. ఆదరణ పథకం ద్వారా నాయీ బ్రాహ్మణులకు సబ్సిడీపై నూతన పరికరాలను ప్రభుత్వం తక్షణమే అందజేయాలని కోరారు.