ఎల్. ఎన్. పేట: ఓటర్ల నమోదులో అలసత్వం వహించవద్దు

ఓటర్ల నమోదులో బిఎల్వోలు జాగ్రత్తలు తీసుకోవాలని తహశీల్దార్ జామి ఈశ్వరమ్మ అన్నారు. గురువారం ఎల్. ఎన్. పేట మండల తహశీల్దార్ కార్యాలయంలో బిఎల్వోలతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల నమోదు సున్నితమైన విషయం కావడం వలన ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. ఈ నెల 9, 10, 23, 24 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో బిఎల్వోలు ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி