బూర్జ: పట్టాదారు పాస్ పుస్తకాలలో తప్పులు సరి చేయండి

బూర్జ మండలం కంట్లాం పంచాయతీ లచ్చయ్య పేట గ్రామంలో శనివారం భూముల రీ సర్వే, గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆముదాలవలస నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొని స్థానిక రైతులు గ్రామస్తులతో మాట్లాడారు. భూముల రికార్డుల్లో తప్పులు సరి చేయాల్సిన బాధ్యత భూములు సర్వే చేసిన ఉద్యోగులపై ఉందని ఎమ్మెల్యే అన్నారు. తక్షణమే తప్పులు సరిదిద్దాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி