ఆముదాలవలస: మండలంలో పలుసమస్యలపై పలువురు సర్పంచులు సంబంధిత అధికారులను నిలదీశారు. శనివారం ఆముదాలవలస మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తమ్మినేని శారదమ్మ అధ్యక్షతన మండల సమావేశం ఎంపీడీవో ఆర్ వెంకట్రావు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ, గృహనిర్మాణ, వైద్య ఆరోగ్య, విద్యాశాఖ అధికారులపై పలువురు సర్పంచులు గౌరీపతి, ఢిల్లీ రాజు, లక్ష్మీనారాయణ జి రమణమూర్తి విరుచుకుపడ్డారు. ప్రభుత్వం మారిన అధికారులు తీరు మారలేదని ద్వజమెత్తారు.