నెల్లూరు జిల్లాలో తుఫాన్ ప్రభావం ఎక్కువగా కావలి పట్టణంలో కనిపిస్తుంది. జిల్లావ్యాప్తంగా ఉదయం నుంచి మోస్తారు వర్షాలే కురుస్తున్నప్పటికీ. కావలిలో మాత్రం అందుకు భిన్నంగా ప్రతి ప్రాంతంలో వర్షపునీరు ఏరులై పారుతుంది. ప్రజలు కనీసం ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ప్రతి ప్రాంతం చెరువును తలపిస్తుంది. మరో రెండు రోజులు తుఫాను ప్రభావం ఉండనున్న నేపథ్యంలో కావలి ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు.