కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు మంగళవారం డిఎస్పీని కలుసుకుని ఆయనను శాలువతో సత్కరించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని డిఎస్పికి అందించారు. డిఎస్పీ తమ కార్యాలయంలో వెంటనే ఆ చిత్రపటాన్ని పెట్టారు. అనంతరం, కావలి లో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను డిఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.