కావలిలోని పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీ లోని శివరామయ్య సుబ్బయ్య కాలనీలో నివసిస్తున్న ప్రజల ఇళ్లల్లోకి వర్షపునీరు రావడంతో వారిని పునరావాసం కేంద్రానికి తరలించారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు టిడిపి నాయకులు వారికి భోజనాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. టిడిపి నాయకులు అధికారులు ఎమ్మెల్యే ఆదేశాలతో వారి వద్ద ఉంటూ వారికి కావలసిన ఏర్పాట్లు చూస్తున్నారు.