తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురిసాయి. దీంతో పలు బీడు భూములు, పంట పొలాలు నీటమనిగాయి. తుఫాన్ ప్రభావం సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనబడడంతో ఆ పరిసర ప్రాంత పొలాలన్ని నీటమునిగాయి. కోవూరు, కావలి, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో చేతికి అంది వచ్చిన పంట నీటి పాలు కావడంతో రైతుల ఆవేదనకు అవధులు లేకుండా పోయింది.