సింగరాయకొండ: చెరువుకు మరమ్మతులు

సింగరాయకొండ మండలం బింగినపల్లి చెరువుకు అధికారులు మరమ్మతులు నిర్వహించారు. సోమవారం నుంచి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీరు అంతా చెరువు నుంచి వృధాగా వెళ్ళిపోతున్నాయి. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. గండ్లను పూడ్చిపెట్టి తూముల నుంచి నీరు వృధా కాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. మంత్రి స్వామి ఆదేశాలతో చెరువుకు మరమ్మత్తులు నిర్వహించామని అధికారులు చెప్పారు.

தொடர்புடைய செய்தி