గ్రామీణ ప్రాంతాల్లో మద్యం బెల్ట్ షాపుల నిర్వహణపై మహిళా పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచాలని నెల్లిమర్ల ఎస్సై గణేష్ తెలిపారు. మంగళవారం ఆయన పోలీస్ స్టేషన్లో సిబ్బంది అలాగే మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో నేర చరిత్ర కలిగిన వ్యక్తుల ప్రవర్తన, కదలికల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు.