డెంకాడ: డ్రోన్ల సహాయంతో బ్లాక్ స్పాట్లను గుర్తించాలి

డెంకాడ మండల కేంద్రంలో డ్రోన్ల సహాయంతో బ్లాక్ స్పాట్లను గుర్తించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఎస్సై ఏ సన్యాసి నాయుడు తన సిబ్బందితో మంగళవారం చర్యలకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో హైవే అథారిటీ సిబ్బందితో కలిసి ముఖ్య కూడళ్లలో సందర్శించారు. అనంతరం డ్రోన్ల సాయంతో బ్లాక్ స్పాట్లను గుర్తించారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

தொடர்புடைய செய்தி