నెల్లిమర్ల మండల వ్యాప్తంగా సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి

నెల్లిమర్ల మండల వ్యాప్తంగా మహిళలు సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని ఎంపీడీవో రామకృష్ణంరాజు కోరారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఉల్లాస్ శిక్షణా తరగతుల నిర్వహించారు. బ్యాంకింగ్ లావాదేవీలు, చట్టాలపై అవగాహన, డిజిటల్ లిట్రసి, ప్రభుత్వ పథకాలపై మహిళలకు అవగాహన తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. ప్రతి 10 మంది మహిళలకు ఒక వాలంటీర్ టీచర్ ను నియమించడం జరుగుతుందన్నారు. ఉల్లాస్ కార్యక్రమం మార్చి 25 వరకు కొనసాగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி