దివ్యాంగులకి ఉపకరణాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

దివ్యాంగుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, వారి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. బుధవారం స్థానిక రాజా క్రీడా మైదానంలో ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపకరణాలు దివ్యాంగులకి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, లోవరాజు, సత్యనారాయణ, రాము, గణేష్, కమిషనర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி