ఏడవ రోజు సరస్వతి దేవి అలంకరణలో దుర్గమ్మ

కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సురవరం గ్రామంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు సరస్వతి దేవి అలంకరణలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. పురోహితులు దుర్గమ్మ మండపాల్లో బుధవారం చిన్నపిల్లలతో సరస్వతి పూజలు చేయించారు. చిన్నపిల్లలతో అక్షరాభ్యాసాలు నిర్వహించారు. కుంకుమ పూజలు, ధూప, దీప నైవేద్యాలు అమ్మవారికి అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పిల్లలు మహిళలుభారీ సంఖ్యలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி