రామచంద్రపురం మండలం ద్రాక్షారామలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసమే గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని, ప్రస్తుత అధికార కూటమి నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇందుకు నిరసనగా వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు స్వామికి పూజలు నిర్వహించామన్నారు.