రాజమండ్రిలో ఏపీ దివ్యాంగుల క్రికెట్ డెవలప్మెంట్ అసోసియేషన్ తూ. గో జిల్లా ఇన్ఛార్జ్ పల్నాటి బలరామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అఖిలభారత దివ్యాంగుల హక్కుల జాతీయ కార్యదర్శి ముత్యాల పోసి కుమార్ పాల్గొని మాట్లాడారు. వచ్చే నెల 8వ తేదీ నుంచి విశాఖపట్నంలో ఈ దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందని, ఆసక్తి కలిగిన వారు పాల్గొనాలని సూచించారు.