సైబర్ నేరాల నివారణకు మహిళలు అవగాహన కలిగి ఉండాలని నిడదవోలు పట్టణ ఎస్ఐ శోభన్ కుమార్ అన్నారు. మంగళవారం నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో వివిధ అంశాలపై మహిళలకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మహిళలు వివిధ నేరాలు జరగకుండా పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో మెప్మా సిటీ మేనేజర్ జ్యోతి మహిళలు పాల్గొన్నారు.