భారీ కుంభకోణానికి పాల్పడిన ఆదానీని తక్షణమే అరెస్టు చేయాలని సీపీఎం తూర్పు గోదావరి జిల్లా నాయకులు జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. గౌతమ్ అదానీ ఆ గ్రూపుకు చెందిన మరో ఆరుగురిపై అమెరికా న్యాయస్థానంలో కేసు నమోదైన నేపథ్యంలో గౌతమ్ ఆదానీని అరెస్టు చేయాలని దేశవ్యాప్తంగా సీపీఎం పిలుపు మేరకు నిడదవోలు అంబేడ్కర్ చౌక్ వద్ద శుక్రవారం సాయంత్రం నిరసన కార్యక్రమం నిర్వహించారు.