మండపేట: మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే ఊరుకోం

ఊరి చివర ఉండాల్సిన మద్యం దుకాణాలను తీసుకొచ్చి ఊరి మధ్యలో నివాసాల మధ్య ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదని గొల్లపుంత ప్రజలు హెచ్చరించారు. మండపేట పట్టణ పరిధిలోని గొల్లపుంత రోడ్డులో గనిశెట్టి వారి వీధికి వెళ్ళే దారిలో మద్యం దుకాణం ఏర్పాటు నేపథ్యంలో గురువారం స్థానికులు అడ్డుకున్నారు. మద్యం దుకాణం ఏర్పాటవుతున్న చోటే టెంట్ వేసి నిరసనకు దిగారు. గొల్లపుంత రోడ్డులో కాసేపు ధర్నా నిర్వహించారు.

தொடர்புடைய செய்தி