ఎంఎస్ ఎం ఈ( సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల) క్రమ బద్దీకరణ కోసం చేపట్టనున్న ర్యాంపు సర్వే కు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన మొబైల్ యాప్ పై మండపేట మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సచివాలయం సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు మాట్లాడుతూ చిన్న తరహా పరిశ్రమల క్రమబద్ధీకరణపై సర్వే పూర్తి చేసి ఉదయం యాప్ నందు నమోదు చేయాలన్నారు.