ఆలమూరులో బెల్ట్ షాపు లపై దాడి... ముగ్గురిపై కేసు నమోదు

ఆలమూరు మండలంలో అనధికారిక బెల్ట్ షాపులపై ఎక్సైజ్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 33 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేశారు. అమలాపురం ఏఈఎస్ అమర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో చెముడు లంక గ్రామంలో నాగిరెడ్డి వెంకటేశ్వరరావు అలాగే బడుగువాని లంకలో బోడపాటి పెంటయ్య, కొత్తూరు సెంటర్ వద్ద వీరభద్రరావుపై కేసు నమోదు చేసినట్లు సిఐ నాగేశ్వరరావు తెలిపారు.

தொடர்புடைய செய்தி