కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు ఆదేశాల మేరకు 34 వార్డు నందు గల ప్రజలకు, ప్రభుత్వం మంజూరు చేసిన కొమరగిరి ప్లాట్స్ కోసం సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు మాట్లాడుతూ కూటమి హయాంలో ప్రతి ఒక్కరికి లోన్ మంజూరు చేస్తూ సొంతింటి కలను నెరవేర్చి దిశగా అడుగులు వేస్తుందని దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.