కాకినాడ: ఫీజులు చెల్లించలేదని నర్సింగ్ విద్యార్థుల పట్ల అమానుషం

కాకినాడలోని ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో దారుణం జరిగింది. ఫీజులు చెల్లించలేదని 40 మంది విద్యార్థినులను రెండు రోజుల పాటు బంధించి, హాస్టల్ వెళ్లనివ్వకుండా ఉంచారు. భోజనం, నీళ్లు వంటి మౌలిక సౌకర్యాలు కూడా అందించలేదు. ఈ విషయం తెలుసుకున్న ఆర్డీవో సంభందిత కళాశాలకు వెళ్లి భోజనం అందించారు. ఫీజు రీఎయింబ్స్మెంట్ డబ్బులు వచ్చే వరకూ విద్యార్థినులను ఇబ్బంది పెట్టొద్దని ఆదేశించారు. ఈ ఘటనపై సమాచారం తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி