కాకినాడలో భారీ వర్షం

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కాకినాడ నగరంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి పలు మార్లు వర్షం పడింది. ఉదయం ఎనిమిది గంటల వరకూ వర్షం కురవడంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. సినిమా రోడ్డులో వర్షం నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

தொடர்புடைய செய்தி