క్లాప్ వాహన డ్రైవర్స్ బకాయి జీతాల కోసం చేపట్టిన ఆందోళన 20వ రోజుకు చేరుకుంది. కాకినాడలో బుధవారం కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పోస్ట్ కార్డు ద్వారా తమ సమస్యలను రాసి పంపించారు. ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు మేడిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ క్లాప్ వాహన డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలని ఉత్తరాలు రాయడం జరిగిందన్నారు.