నూతన కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రణాళికలో జిల్లా తీర ప్రాంత పరిక్షణ, అభివృద్ది, మత్స్యకారుల జీవనోపాధి భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలియజేశారు. శనివారం కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాలులో, జిల్లా కాలుష్యనియంత్రణ మండలి ఆధ్వర్యంలో కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రణాళిక పై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.