కాకినాడలో బాలుడి కుక్కల చరణ్ శ్రీ తేజ అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆర్పీఐ పిట్టా వర ప్రసాద్, ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు పప్పు దుర్గ రమేష్ కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. రాజకీయ జోక్యంతో కేసు నీరసిస్తున్నారని ఆరోపిస్తూ.. న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు.