కిర్లంపూడి: మహిళా మార్ట్ ను పరిశీలించిన డీపీఎం రాయ్

కిర్లంపూడిలోని మహిళా మార్ట్ ను మంగళవారం కాకినాడ జిల్లా వెలుగు డీపీఎం రాయ్ సందర్శించారు. ఈ సందర్భంగా మార్ట్ లోని ధరల పట్టికను పరిశీలించారు. సేల్స్ ను మరింత పెంచాలని సూచించారు. ఆయన మాట్లాడుతూ. మహిళలు అధిక శాతం రుణాలు పొందుతూ వివిధ వ్యాపార సంస్థలతో పోటీపడి మరింత అభివృద్ధి చెందాలన్నారు. మహిళా సంఘాల అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி