జగ్గంపేట: రేపు ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

జగ్గంపేట మండలంలో 33 కేవీ రాజపూడి ఫీడర్ వద్ద చెట్లు నరికివేత, మరమ్మతులు కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ వీరభద్రరావు గురువారం ప్రకటనలో తెలిపారు. జగ్గంపేట మండలంలో రాజపూడి, కొత్తూరు, మల్లిసాల, వెంగయ్యపురం, గోవిందపురం, కృష్ణాపురం, సీతారాంపురం, జగ్గంపేట సీహెచ్సీ, బాలాజీ రైస్ మిల్లులకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు తమకు సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி