తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) నూతన పాలకవర్గాన్ని ఏపీ ప్రభుత్వం నియమించింది. బుధవారం మొత్తం 24 మంది సభ్యులతో కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు టిటిడి పాలకవర్గ సభ్యుడిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు, కూటమి శ్రేణులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.