800 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

జగంపేట మండలంలోని మామిడాడలో సారా బట్టీలపై సోమవారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో సారా తయారీకి సిద్ధం చేసిన 800 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్టు స్థానిక ఎస్సై టి. రఘునాథబాబు తెలిపారు. సారా తయారీకి పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని నుంచి 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி